Teachings of Gita bring relief to every suffering. We are just one click away to answer, if you have any concerns/ Questions. Feel free to be in touch.
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్). ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‍గా, ప్రిన్సిపాల్‍గా, రీడర్‍గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. దాదాపు 80 కథలు ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి. ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని, ‘సాఫల్యం’ అనే నవలని, ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవలని ప్రచురించారు. ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్‌విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్‌ఫోరమ్’ వారు ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం వారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
Uppala Harsha Teja Nilayam, Anupuram, 2nd Avenue,
Adj Lane Veg Parivar Restaurant, Dr AS Rao Nagar,
Hyderabad-500062
Web Design & Developed by Ikongraffika